వట్టికోట ఆళ్వారుస్వామి అతని కలం వజ్రాయుధం…అతనిది న్యాయపథం….అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్….ఆనంద రమణికి షల్వార్ ఆళ్వార్….ఇవి దాశరధి రాసిన అగ్నిధార కవితా సంకలనంలో ఆళ్వారుకు అనే కవితలోని పంక్తులు. కవిత రాయటమే కాదు…తెలంగాణా ప్రజాసాహిత్యానికీ, ఉద్యమానికి ఊపిరిపోసిన యోధుడు వట్టికోట ఆళ్వారుస్వామికి దాశరధి తన అగ్నిధారను అంకితం చేశారు. 1915 నవంబరు ఒకటిన నల్లొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని మాచవరం గ్రామంలో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండి పెడుతూ విద్యాభ్యాసం [...]
నవంబరు 2009ను భద్రపఱచు
తెలంగాణా తల్వార్ ఆళ్వార్
నవంబరు 21, 2009మైసూరు పులి..బ్రిటీష్ వెనుచలి `టిప్పుసుల్తాన్`
నవంబరు 19, 2009మైసూర్ పులి, బ్రిటీష్ పాలకుల వెనుచలి..టిప్పు సుల్తాన్ జయంతి ఈ రోజు. కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా దేవనహల్లిలో 1750, నవంబర్ 20న ఆయన జన్మించారు. అతని తండ్రి హైదర్ అలీ మైసూర్ రాజు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు మొయినుద్దీన్ కుమార్తె. మైసూర్ సంస్థానాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తున్న నేతగా అప్పటికే టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీకి మంచి పేరుంది. ఫ్రెంచి పాలకుల కోరిక మేరకు మైసూర్ లో మొట్టమొదటి చర్చి నిర్మించిన [...]
రెక్క తెగిన పక్షి పాట..పికాసో
నవంబరు 17, 2009పికాసో చిత్రమా…ఎల్లోరా శిల్పమా…! ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదూ..! ప్రేమికుల ఊహా చిత్రం, ప్రాకృతిక సౌందర్యం, జీవన మాధుర్యం..మనిషి అంతరంగంలో రగిలే అగ్నిగుండం, ఎగిసిపడే కల్లోల కెరటం, కన్నీటి తరంగం, విధ్వంస వ్యూహం…ప్రపంచ రక్త చరిత్రలో తడిసి ముద్దయిన మానవ దేహం….20 వ శతాబ్ధంలో అన్నిటినీ ఒకే చోట బంధించి మానవాళికి కానుకగా సమర్పించిన అపురూప చిత్రకారుడు పాబ్లో పికాసో పుట్టిన రోజు నేడు. 20వ శతాబ్దపు చిత్రకళా విశ్వంభర ఉత్సవమూర్తి గా ఘన కీర్తి [...]
జార్ఖండ్ హీరో బొర్సా ముండా
నవంబరు 16, 2009జార్ఖండ్ అల్లూరి…స్వాతంత్ర్య వీరుడు..స్వరాజ్య బాలుడు…బిర్సా ముండా జయంతి ఈ రోజు. 1875 నవంబర్ 15న అపుడు బీహార్ లో భాగంగా ఉన్న జార్ఖండ్ లో ముండా తెగకు చెందిన ఆదివాసీ కుటుంబంలో ఆయన జన్మించారు. బ్రిటీష్ పాలకుల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న అడవి తల్లి శోకాన్ని చూసి బిర్సా ముండా చలించిపోయారు. గిరిజన తండాలను ఏకం చేశారు. మన్యంలోని సాంప్రదాయక ఆయుధాలతో బ్రిటీష్ పాలకులను తమ ప్రాంతం నుంచి తరిమికొట్టేందుకు ఉద్యమించాడు. బ్రిటీష్ దొరలపై బిర్సా ముండా [...]