స్టీఫెన్ హాకింగ్…మనసా వాచా కర్మణా మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. చరిత్రలో పొత్తిళ్ళలో భద్రంగా దాచుకోదగిన ఆణిముత్యం. జీవన యుద్ధంలో విధిని ఓడించిన వీరుడెవరిని అడిగితే…ఈ శతాబ్దంలో `స్టీఫెన్ హాకింగే`నని చెప్పవచ్చు. స్టిపెన్ హాకింగ్ గా ప్రసిద్ధుడయిన ఆయన పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ….చచ్చుపడిపోయిన కాళ్ళు…మూగబోయిన గొంతు…ఎటూ కదల్లేక చక్రాల కుర్చీలో గడిచిపోతున్న జీవితం…ఖగోళ శాస్త్ర పరిశోధనలో చరిత్ర సృష్టించిన మహోన్నత మానవ రూపం…చైతన్య జ్వలితం. మన కళ్ళెదుటే ఈ తరానికి నిలువెత్తు [...]