నాన్నంటే ఆకాశం. వెన్నెలై ప్రేమను ప్రసరించినా, ఉరుమై కోపాన్ని ప్రదర్శించినా నాన్నంటే నాన్నే…. ఎదుగుతున్న బిడ్డల వైపు నాన్న క్రీగంట చూస్తాడు. నా `తల్లీ కదా…నా తండ్రి కదా….నిన్న మొన్నటి దాకా నా గుండెలపై ఆడుకున్న పసి మొగ్గలు కదా ` అనుకుని మనసారా మురిసిపోతాడు. మన చిట్టి చేతులు పట్టుకుని నడిపించినవాడు…దారి చూపించినవాడు….మన బుజ్జి కాళ్ళతో గుండెలపై తంతుంటే తనివితీరా ముద్దాడినవాడు…. నాన్న కెన్నో కష్టాలు….తినీ తినక పైసా పైసా మన కోసమే కూడపెట్టి బిడ్డలు [...]